వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం విజయవాడలో కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం లబ్బిపేటలోని షిరిడీసాయిని వైఎస్ జగన్ దర్శించుకున్నారు. శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఆలయంలో వైఎస్ జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.