యువతిపై అత్యాచారం చేసి లారీలోంచి తోసేశాడు | Young women rapped by Lorry driver | Sakshi
Sakshi News home page

Sep 22 2013 7:28 PM | Updated on Mar 21 2024 7:50 PM

ఢిల్లీలో కదులుతున్న బస్సులో నిర్భయపై అత్యాచారం ఘటన మరువక ముందే మన రాష్ట్రంలో అటువంటి సంఘటనే జరిగింది. అయితే అక్కడ బస్సు అయితే, ఇక్కడ లారీ. మెదక్‌ జిల్లా రామాయంపేటకు చెందిన ఓ యువతి హైదరాబాద్‌ వెళ్లేందుకు లారీ ఎక్కింది. మార్గమధ్యంలో లారీడ్రైవర్‌ ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తరువాత బచ్చన్నపేట మండలం తమ్మడపల్లి దగ్గర లారీ నుంచి తోసివేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను చూసి గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలిని జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement