ఓవైపు ఉత్తర భారతం నుంచి ఒరిస్సా వరకు రుతుపవన ద్రోణి, మరోవైపు ఉపరితల ఆవర్తనం రెండూ కలవడంతో రుతుపవనాలు ఊపందు కున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి తెలిపారు. దీంతో సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు.