పండించిన పొగాకు ధరలు పడిపోవటంతో తీవ్ర ఆందోళన చెందిన రైతు గుండెపోటుతో మృతిచెందారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా జరుగుమిల్లి మండలంలో బుధవారం జరిగింది. వివరాలు.. మండలంలోని చింతలపాలెం గ్రామానికి చెందిన దళిత రైతు మిడసల కొండలరావు (55) పదెకరాల్లో పొగాకు వేశారు. బుధవారం ఉదయం టంగుటూరులోని వేలం కేంద్రానికి పొగాకు తీసుకుని వేలం పాటకు హాజరయ్యాడు. అయితే, గిట్టుబాటు ధర లభించే పరిస్థితి కనిపించకపోవటంతో కొండలరావు తీవ్ర ఆందోళనకు గురై గుండెపోటుతో అక్కడే కుప్పకూలి చనిపోయాడు.
Jul 8 2015 6:24 PM | Updated on Mar 22 2024 10:59 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement