డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ అసెంబ్లీ రగడపై తీవ్రంగా స్పందించారు. తమిళనాడు అసెంబ్లీలో ఒక ప్రతిపక్ష నాయుడికి తీరని అవమానం జరిగిందని ధ్వజమెత్తారు. ప్రమాజమాస్పీకర్ సభా మర్యాదలు పాటించడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. తన చిరిగిన చొక్కాను చూపిస్తూ కొట్టి, తిట్టి తమను బలవంతంగా బయటకు లాగిపడేశారని ఆరోపించారు. సభలో జరిగిన పరిణామాలు, పరిస్థితులను వివరించేందుకు స్పీకర్ తో భేటీ కానున్నట్టు చెప్పారు. దీనిపై ఫిర్యాదు చేయనున్నట్టు ఆయన తెలిపారు.