వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు సమైక్యాన్ని కాంక్షిస్తూ జిల్లా వ్యాప్తంగా విద్యార్థి లోకం కదం తొక్కింది. పార్టీ నాయకుల సారధ్యంలో పెద్ద ఎత్తున ర్యాలీలు, మానవహారాలతో హోరెత్తించింది. జిల్లా పార్టీ కన్వీనర్ మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలోచిలకలూరిపేటలో పెద్ద ఎత్తున ప్రదర్శన జరిగింది.