కరీంనగర్ జిల్లా మల్యాల మండలం మానాల వద్ద ఎస్సారెస్పీ ప్రధాన కాకతీయ కాల్వకు మంగళవారం ఉదయం భారీ గండిపడింది. దీంతో మల్యాల, పెగడపల్లి, గొల్లపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో గల చెరువులు నిండి, గండ్లు పడటంతోపాటు సుమారు 1,500 ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. ఇళ్లలోకి నీళ్లు రావడంతో బాధితులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. పలుచోట్ల రోడ్లపై నీళ్లు రావటంతో రాకపోకలు స్తంభించాయి. మానాల గ్రామం దమ్మక్క చెరువులోకి నీళ్లు వెళ్లే తూము డీ-65 వద్ద కాకతీయ ప్రధాన కాల్వకు ఈ గండిపడింది.