నగదు రహిత విధానంతో కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ప్రజల ఆలోచనా విధానంలో మార్పు రావాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. రైతులు సైతం నగదు రహిత లావాదేవీలకు అలవాటు పడాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో డిజిటల్ చెల్లిం పులను అభివృద్ధి చేసేందుకు, ప్రజలకు అవసరమైన సేవలను అందించేందుకు బ్యాంకింగ్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ ముందుకు వచ్చింది. మంగళవారం ఆ బ్యాంకు అధికా రులు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. డిజిటల్ బ్యాంకింగ్ సేవలను అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు వారు వివరించారు. సాధ్యమైనంత త్వరలోనే తెలంగాణ రాష్ట్రం పూర్తిస్థాయి డిజిటల్ విధానాన్ని అలవరుచుకుంటుందని, నగదు రహిత లావాదేవీలు జరిపే రాష్ట్రంగా నిలుస్తుందని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
Dec 7 2016 7:38 AM | Updated on Mar 21 2024 7:53 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement