ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఉగ్రవాదికి, పోలీసులకు మధ్య కాల్పులు చోటుచేసుకోవడం కలకలం రేపింది. నగర శివారల్లోని ఠాకూర్‌గంజ్ ప్రాంతంలో ఓ అనుమానిత ఉగ్రవాది నక్కినట్టు సమాచారం అందడంతో ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) రంగంలోకి దిగింది. దీంతో ఏటీఎస్ పోలీసులు, ఉగ్రవాదికి మధ్య ఎదురుకాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. ఉగ్రవాదిని పట్టుకునేందుకు ఏటీఎస్ దళాలు, పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆపరేషన్ కొనసాగుతున్నదని యూపీ పోలీసు చీఫ్ జవీద్ అహ్మద్ విలేకరులకు తెలిపారు