సాక్షి టెలివిజన్ చానల్‌లో ప్రసారమైన సందేశాత్మక కథనానికి ప్రతిష్టా త్మక యునిసెఫ్ అవార్డు దక్కింది. ఆడపిల్లను కడుపులోనే కడతేరిస్తే పండుగలన్నీ వెలవెల బోతాయనే ఇతివృత్తంతో ‘ఆడపిల్లలను కాపాడుకుందాం... బతుకమ్మ సాక్షిగా వారిని బతకనిద్దాం’ అనే సందేశంతో ‘సాక్షి’ టీవీలో ప్రసారమైన రెండు నిమిషాల నిడివి గల కథనం ఉత్తమ సందేశం విభాగంలో యునిసెఫ్ అవార్డుకు ఎంపికైంది. బతుకమ్మ పండుగ నేపథ్యంలో ఈ కథనం ప్రసార మైంది.