సదావర్తి సత్రం భూముల అమ్మకానికి సోమవారం ఉదయం బహిరంగ వేలం ప్రారంభమైంది. చెన్నై టీ నగర్‌లోని టీటీడీ సమాచార కేంద్రంలో సోమవారం ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం ప్రక్రియ మొదలైంది. ఈ–టెండరు కమ్ సీల్డు కవర్ కమ్ బహిరంగ వేలం పద్ధతిన 83.11 ఎకరాల సత్రం భూముల అమ్మకానికి మళ్లీ వేలం నిర్వహిస్తున్నారు. సదావర్తి భూమల బహిరంగ వేలానికి అనూహ్య స్పందన వస్తోంది. భూములను దక్కించుకునేందుకు పోటాపోటీగా వేలం పాట కొనసాగుతోంది. వేలంపాట ఇప్పటివరకూ రూ.42.05 కోట్లు దాటింది. గతంలో 83.11 ఎకరాలను రూ.22.40 కోట్లకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన వారికి సదావర్తి భూములు కట్టబెట్టిన విషయం విదితమే.