గోవాడ చక్కెరమిల్లు మహాజన సభ బుధవారం రణరంగమైంది. నిరసనలు,ధర్నాలు, రాస్తారోకోలు, అరెస్టులు, లాఠీ ఛార్జీలతో అట్టుడికిపోయింది. నెలరోజులుగా రైతుల్లో నివురుగప్పిన నిప్పులా ఉన్న నిరసన ఒక్కసారిగా పెల్లుబికింది. మునుపెన్నడూలేని విధంగా చెరకు రైతుల మహాజనసభ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.