అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు విషయంలో తనపై వచ్చిన ఆరోపణలను ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఖండించారు. అగ్రిగోల్డ్ భూముల కొనుగోలులో తనపై వచ్చిన ఆరోపణలపై విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. అగ్రిగోల్డ్ సంస్థల్లో, హాయ్‌ల్యాండ్ ప్రాపర్టీకి కూడా డైరెక్టర్‌గా ఉన్న దినకరన్ వద్ద తాను కొన్న భూములకు, ఆరోపణలు వెల్లువెత్తుతున్న అగ్రిగోల్డ్ భూములకు సంబంధం లేదన్నారు. అగ్రిగోల్డ్ సంస్థలో దినకరన్ ప్రొఫెషనల్ డైరెక్టర్ మాత్రమేనని తెలిపారు.