డిసెంబర్ 5 నుంచి పార్లమెంట్ సమావేశాలు | Parliament's Winter Session to be held from Dec 5 to Dec 20 | Sakshi
Sakshi News home page

Nov 11 2013 1:42 PM | Updated on Mar 21 2024 6:35 PM

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు డిసెంబర్‌ 5న ప్రారంభం కానున్నాయి. డిసెంబర్‌ 20 వరకు సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణంగా శీతాకాల సమావేశాలు నెలపాటు నిర్వహిస్తారు. కాని ఈసారి ఐదు రాష్ట్రాల ఎన్నికల దృష్ట్యా సమావేశాల వ్యవధిని ప్రభుత్వం తగ్గించింది. రాష్ట్ర విభజనకు సంబంధించిన బిల్లును శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెడతామని కేంద్ర హోం మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే ప్రకటించారు. మరోవైపు మత హింస బిల్లుతో సహా వివిధ పెండింగ్ బిల్లులను ఈ సమావేశాలలోప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్దమవుతుంది. అలాగే కీలక సంస్కరణలు, ద్రవ్యోల్బణం, అధిక ధరలు, తెలంగాణ తదితర అంశాలు సమావేశాలో చర్చకు రానున్నాయి.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement