విభజనకు ముఖ్య కారకుడు మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి అని కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మంత్రి చిరంజీవి విమర్శించారు. సీఎం పదవి పోతుందన్న భయంతోనే ఆయన విభజనకు కారకుడయ్యారని తెలిపారు. తెలంగాణకు ప్యాకేజీ ఇచ్చేందుకు అధిష్టానం మొగ్గుచూపితే వద్దని అడ్డుపడ్డారని వెల్లడించారు. కిరణ్ ముందుగానే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసుంటే విభజన జరిగేది కాదన్నారు. రాష్ట్ర విభజన చేసి కాంగ్రెస్ ఆత్మహత్య చేసుకుందన్న కిరణ్ వ్యాఖ్యలపై స్పందిసూ... కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీపై అందరూ కలిసి హత్యాయత్నం చేశారన్నారు. విభజన తప్పయితే దానికి అందరూ కారణమన్నారు. కాంగ్రెస్ బస్సుయాత్ర ప్రారంభం సందర్భంగా నిర్వహించిన సభలో చిరంజీవి ప్రసంగించారు. పదవులు అనుభవించి పార్టీ వెళ్లిపోవడం సమంజసం కాదన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు తమ వెంటే ఉన్నారని చిరంజీవి చెప్పారు. సీమాంధ్రలో కాంగ్రెస్ కార్యకర్తలే నాయకులని అన్నారు. కాంగ్రెస్ను పునరుజ్జీవం చేయాల్సిన అవసరముందని చిరంజీవి అన్నారు.
Mar 21 2014 3:10 PM | Updated on Mar 22 2024 11:31 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement