ఉత్తరప్రదేశ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార సమాజ్‌వాదీ పార్టీలో ఏర్పడ్డ సంక్షోభం ముదిరింది. యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, సమీప బంధువు రాంగోపాల్ యాదవ్‌లకు ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ములాయంకు అఖిలేష్ కుమారుడన్న విషయం తెలిసిందే. ఇక రాంగోపాల్ ఆయనకు వరుసకు సోదరుడు అవుతారు.