ఆవును చంపితే జీవిత ఖైదు: కోర్టు | Make cow the national animal: Rajasthan HC to Centre | Sakshi
Sakshi News home page

May 31 2017 4:46 PM | Updated on Mar 21 2024 8:11 PM

ఎవరైనా ఆవులను చంపితే వాళ్లకు జీవిత ఖైదు విధించాలని రాజస్థాన్ హైకోర్టు సూచించింది. చాలామంది హిందువులు పవిత్ర జంతువుగా భావించే ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కూడా తెలిపింది. ఆసియాలోనే అత్యుత్తమ గోరక్షణ కేంద్రాల్లో ఒకటిగా భావించే హింగోనియా గోశాల కేసును హైకోర్టు విచారిస్తోంది. అక్కడ గత సంవత్సరం జనవరి 1 నుంచి జూలై 31 వరకు ఏకంగా 8వేల ఆవులు చనిపోయాయి. రాజ్యాంగంలోని 48, 51 ఎ(జి) అధికరణాలను బట్టి చూస్తే ఆవులకు తగిన రక్షణ కల్పించడంతో పాటు వాటిని పూర్తిగా సంరక్షించాలని, అందువల్ల ప్రభుత్వం ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని జస్టిస్ మహేష్ చంద్ర శర్మ తన 145 పేజీల తీర్పులో తెలిపారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement