breaking news
national animal
-
పులి వద్దు.. గోమాత ముద్దు! సుప్రీం ఏమందంటే..
న్యూఢిల్లీ: జాతీయ జంతువుగా రాయల్ బెంగాల్ టైగర్ స్థానే ఆవును ప్రకటించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ దాఖలైన ఓ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ అభయ్ ఎస్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం.. సోమవారం పిటిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘అసలు ఎలాంటి ప్రాథమిక హక్కులు ప్రభావితం అవుతాయి. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించడం కోర్టు పనా?.. మేము ఖర్చులు విధించవలసి వచ్చినప్పుడు మీరు అలాంటి పిటిషన్లను ఎందుకు దాఖలు చేస్తారు?.. అసలు ఇప్పుడు ఏ ప్రాథమిక హక్కు ఉల్లంఘించబడింది? మీరు కోర్టుకు వచ్చినందునా మేము చట్టాన్ని గాలికి విసిరేస్తామా?’’ పిటిషనర్ తరపు న్యాయవాదిని మందలించింది బెంచ్. పిటిషన్ దాఖలు చేసినందుకుగానూ ఖర్చులు విధించాల్సి వస్తుందని పిటిషనర్ తరపున న్యాయవాదిని బెంచ్ హెచ్చరించింది. దీంతో సదరు న్యాయవాది అభ్యర్థన పిటిషన్‌ను ఉపసంహరించుకోగా, పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. ఎన్జీవో గోవాన్ష్ సేవా సదన్, ఇతరులు కలిసి ఆవును జాతీయ జంతువుగా ప్రకటించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్(పిల్)ను దాఖలు చేసింది. ఇదీ చదవండి: ‘నా కళ్లు చిన్నగా ఉండొచ్చు! కానీ..’ -
ఆవు మాత్రమే అలా చేయగలదు: అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యలు
అలహాబాద్: ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని వ్యాఖ్యలు చేసిన అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ శేఖర్ కుమార్ మరోమారు ఆవుపై వ్యాఖ్యలు చేశారు. అన్ని జంతువుల్లోనూ కేవలం ఆవు మాత్రమే ఆక్సిజన్ పీల్చి ఆక్సిజన్‌ను వదులుతుందని సైంటిస్టులు నమ్ముతారన్నారు. ఆవు పాలు, పెరుగు, నెయ్యి, మూత్రం, పేడ ద్వారా మందు లేని పలు జబ్బులు కూడా నమయవుతాయని చెప్పారు. ఆవును దొంగలించి చంపిన కేసును విచారిస్తున్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సాంభల్ జిల్లాకు చెందిన జావెద్ గతంలోనూ పలు మార్లు ఆవులను దొంగలించి చంపాడని, బెయిల్ ఇస్తే మళ్లీ అలాంటి చర్యలకు పాల్పడతాని వ్యాఖ్యానిస్తూ బెయిల్ నిరాకరించారు. హిందూ పురాణాల ప్రకారం ఆవులో 33 కోట్ల మంది దేవుళ్లు, దేవతలు నివాసముంటారన్నారు. అందుకే గోవధకు హిందువులు వ్యతిరేకమన్నారు. -
జాతీయ జంతువుగా గోమాత
పెందుర్తి: గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామీజీ ప్రతిపాదించారు. గోవుల పరిరక్షణకు ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా నడుం బిగించాలని కోరారు. చాతుర్మాస్య దీక్షా యాత్రలో భాగంగా ఆదివారం రుషికేష్ శారదాపీఠంలో సాధుసంతుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామీజీ అనుగ్రహభాషణ చేస్తూ రుషికేష్, హరిద్వార్‌లో నివసించే స్వాములు ఈ తపో భూమికే అంకితం కాకుండా యావత్ భారతదేశం పర్యటిస్తూ హిందూధర్మ పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు. గోహత్యలు జరగకుండా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్తరభారతంలో హిందూధర్మాన్ని ఏ విధంగా కాపాడుతున్నారో సదస్సులో చర్చించారు. పలు ఆధ్యాత్మిక విషయాలపై సందేహాలను స్వామీజీ నివృత్తి చేశారు. అనంతరం స్వాములు, సాధుసంతులకు బండారా (అన్నదానం) ఏర్పాటు చేశారు. ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీతో కలిసి అందరికీ నూతన వస్త్రాలు, విశేష దక్షిణ అందజేశారు. ముందుగా తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ తరఫున రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ఆయనకు కుమారుడు ఎమ్మెల్యే సతీష్ స్వామీజీకి నూతన వస్త్రాలు అందజేశారు. పవిత్ర గంగాతీరంలో ప్రత్యేక పూజలు ఆచరించారు. తెలంగాణ మంత్రి చామకూర మల్లారెడ్డి దంపతులు స్వామీజీ ఆశీర్వచనం తీసుకున్నారు. వచ్చే జవవరిలో మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూట్‌లో నిర్వహించే అశ్వమేధ యాగంలో పాలుపంచుకోవాలని స్వామీజీని ఆహ్వానించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, రాఘవేంద్రరావు, రంగారావు, డాక్టర్ ఓంప్రకాశ్, ఎలక్షణ్‌రెడ్డి, ప్రసాద్ స్వామీజీ ఆశీర్వచనం తీసుకున్నారు. -
పులి చర్మం ఎక్కడిదీ..?
లక్సెట్టిపేట(మంచిర్యాల) : జాతీయ జంతువు పులి చర్మాన్ని మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట పోలీసులు బుధవారం పట్టుకున్నారు. దానిని తరలిస్తున్న కుమురం భీం జిల్లా తాటినగర్ గ్రామానికి చెందిన రౌతు శ్యాంరావును అరెస్టు చేశారు. పులి చర్మం ఎక్కడినుంచి వచ్చిందనే విషయమై దర్యాప్తు నిర్వహిస్తున్నారు. సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. శ్యాంరావు గతంలో కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో పనిచేశాడు. ఆ సమయంలో అక్కడే పనిచేస్తున్న పట్టణానికి చెందిన రఘు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తనకు పులి చర్మం కావాలని, తెచ్చిస్తే రూ.5లక్షలు ఇస్తానని శ్యాంరావును రఘు కోరాడు. దీంతో శ్యాంరావు బెజ్జూరు మండలం మర్తిడి గ్రామానికి చెందిన విలాస్ అనే వ్యక్తిని సంప్రదించాడు. తనకు పులి చర్మం తెచ్చిస్తే రఘుకు అందజేస్తానని, అతడు ఇచ్చే డబ్బులను ఇద్దరం కలిసి పంచుకుందామని ఒప్పందం కుదుర్చుకున్నాడు. విలాస్ కొద్ది రోజుల తర్వాత పులి చర్మాన్ని తీసుకువచ్చి శ్యాంరావుకు ఇచ్చాడు. శ్యాంరావుæ పులి చర్మాన్ని వాహనంలో తీసుకుని బుధవారం కొత్తగూడెం బయల్దేరాడు. ఈ క్రమంలో లక్సెట్టిపేట ఎన్టీఆర్ చౌరస్తా వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిçండగా శ్యాంరావు అనుమానాస్పదంగా కనిపిచండంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న సంచిని తెరిచి చూడగా అందులో పులి చర్మం లభించిందని సీఐ తెలిపారు. శ్యాంరావును అరెస్టు చేసి కేసు నమోదు చేశామన్నారు. రఘు, విలాస్‌లను అదుపులోకి తీసుకుని విచారించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సై మధుసూదన్‌రావు, కానిస్టేబుల్ శేఖర్ పాల్గొన్నారు. పది మంది ప్రమేయం.. ? పులి చర్మం తరలింపు సంఘటన వెనుక దాదాపు పది మంది ప్రమేయం ఉన్నట్లు సమాచారం. మర్తిడికి చెందిన విలాస్ వన్యప్రాణులను వేటాడుతాడని తెలిసింది. అయితే ఈ పులి చర్మం అతడికి ఎక్కడి నుంచి వచ్చిందని పోలీసులు కూపీ లాగుతున్నారు. రెండేళ్ల క్రితం మహారాష్ట్ర నుంచి కొంత మంది వ్యక్తులు పులి చర్మాన్ని తరలిస్తుండగా బెజ్జూర్ మండలంలో అటవీశాఖ అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ పులి చర్మం బెజ్జూర్‌లోని అటవీ శాఖ క్వార్టర్లో భద్రపర్చగా.. కొద్ది నెలల క్రితం మాయమై.. మమచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో దొరికిన సంగతి విదితమే. తాజాగా పట్టుబడిన పులి చర్మం కూడా గతంలో వలె మహారాష్ట్ర నుంచి వచ్చిందా? లేక కాగజ్‌నగర్ అటవీ డివిజన్లో సంచరిస్తున్న పులిని హతమార్చి ఉంటారా? అని∙అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడైన విలాస్ పట్టుబడితే గాని పులి చర్మం ఎక్కyì నుంచి వచ్చిందనేది అంతుచిక్కదు. విలాస్ కోసం పోలీసులు బుధవారం సాయంత్రం మర్తిడి గ్రామానికి వచ్చి ఆరా తీసినట్లు తెలిసింది. బెజ్జూర్ ఎస్సై లేకపోవడంతో చింతలమానెపల్లి ఎస్సై వచ్చినట్లు సమాచారం. కాగా.. మంగళవారం రాత్రి కొంత మంది వ్యక్తులు మండలంలోని సల్గుపల్లి అంగడి ప్రాంతంలో పులి చర్మం కోసం బేరసారాలు సాగించినట్లు తెలిసింది. ఇందులో మర్తిడికి చెందిన ఇద్దరు రాజకీయ నాయకులతో పాటు మొత్తం పది మంది ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి
-
ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి
జైపూర్: ఆవును జాతీయ జంతువుగా ప్రకటించేలా తగిన చర్యలు తీసుకోవాలని రాజస్తాన్ హైకోర్టు జడ్జి జస్టిస్ మహేశ్‌చంద్ శర్మ బుధవారం ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ అంశం కేంద్ర పరిధిలోనిది కనుక కేంద్రంతో కలసి పనిచేయాలని పేర్కొన్నారు. ఆవును వధించేవారికి జీవిత ఖైదు పడేలా చూడాలనీ సూచించారు. ఆవుకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అడ్వొకేట్ జనరల్‌లు చట్టబద్ధ సంరక్షకులుగా ఉండాలన్నారు. ‘హిందూ దేశమైన నేపాల్ ఆవును జాతీయ జంతువుగా ప్రకటించింది. భారత్ పశుపెంపకంపై ఆధారపడిన వ్యవసాయిక దేశం. 48, 51ఏ(జీ) రాజ్యాంగ అధికరణల ప్రకారం.. ఆవుకు చట్టబద్ధ హోదా కల్పించేందుకు రాష్ట్రం చర్యలు తీసుకోవాలి.. ఆవును చంపేవారికి జైలు శిక్షను మూడేళ్ల నుంచి జీవిత ఖైదుకు పెంచేందుకు రాష్ట్ర చట్టాన్ని సవరించాలి’ అని జస్టిస్ శర్మ తన 145 పేజీల ఉత్తర్వులో పేర్కొన్నారు. జడ్జిగా ఆయన పదవీకాలం బుధవారమే ముగిసింది. జైపూర్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న హింగోనియా గోశాలలో వందలాది ఆవులు చనిపోయిన కేసులో ఈ ఆదేశాలు జారీ చేశారు. తర్వాత జస్టిస్ శర్మ విలేకర్లతో మాట్లాడుతూ తన ఆదేశాలు సిఫార్సుల కిందికి వస్తాయని, వాటికి కట్టుబడటం తప్పనిసరేమీ కాదన్నారు. ‘గోవును వధించేవారిపై చర్యలు తీసుకోవాలని కోరడం నా ఆత్మఘోష, మీ ఆత్మఘోష, అందరి ఆత్మఘోష... ఆవు తల్లివంటిది. పలు వ్యాధుల నుంచి కాపాడుతుంది’ అని అన్నారు. జాతీయ పక్షి నెమలి శృంగారంలో పాల్గొనదని, ఆడ నెమలి.. మగనెమలి కన్నీటిని సేవించే సంతానోత్పత్తి చేసుకుంటుందని ఈ సందర్భంగా న్యాయమూర్తి అన్నారు. గోవు కూడా నెమలి అంత పవిత్రమైనదని వెల్లడించారు. జోక్యానికి కేరళ హైకోర్టు నిరాకరణ తిరువనంతపురం: పశువధపై కేంద్రం తీసుకొచ్చిన నిషేధం విషయంలో జోక్యానికి కేరళ హైకోర్టు నిరాకరించింది. కేంద్ర నోటిఫికేషన్ రాజ్యాంగానికి వ్యతిరేకం కాదని, బీఫ్ అమ్మకం, వినియోగంపై అందులో నిషేధం లేదని పేర్కొంది. నిషేధంపై చర్చించడానికి అన్ని రాష్ట్రాల సీఎంలతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. -
ఆవును చంపితే జీవిత ఖైదు: కోర్టు
-
జనారణ్యంలోకి జాతీయ పక్షి
అప్పుడే ఎండలు మండుతున్నాయి. భూగర్భ జలాలు అడుగుంటాయి. తాగునీటి కోసం జనమే కాదు.. వన్యప్రాణులు సైతం విలవిల్లాడిపోతున్నాయి. దాహార్తిని తీర్చుకునేందుకు అడవులు వదిలి జనారణ్యంలోకి వన్యప్రాణులు వచ్చేస్తున్నాయి. అందుకు మడకశిర మండలం ఆదిరెడ్డిపాళ్యం సమీపంలోని ప్రధాన రహదారిపైకి ఓ నెమలి ఒయ్యారంగా నడుచుకుంటూ వచ్చిన దృశ్యం ఆ మార్గంలో రాకపోకలు సాగించిన వారందరినీ గురువారం ఆకట్టుకుంది. కాసేపటికి అక్కడే ఉన్న కోళ్ల మధ్యలోకి చేరుకుంది. వన్యప్రాణులకు మేత, నీరు ఏర్పాటు చేయాలని స్థానికులు అటవీ అధికారులను కోరారు. - మడకశిర రూరల్ -
నాన్నా పులి
కవర్ స్టోరీ : జూలై 29 ఇంటర్నేషనల్ టైగర్ డే పులి మన జాతీయ జంతువు. పులుల్లో చాలా రకాలు ఉన్నాయి. కచ్చితంగా చెప్పాలంటే ‘రాయల్ బెంగాల్ టైగర్’... తెలుగులో చెప్పుకోవాలంటే ‘బెంగాలీ రాచపులి’ మన జాతీయ జంతువు. ఇప్పటికీ పులుల జనాభాలో మన దేశానిదే అగ్రస్థానం. స్వతంత్ర దేశానికి జాతీయ జెండా, జాతీయ గీతం ఉన్నట్లే జాతీయ జంతువు, జాతీయ పక్షి వంటివి కూడా ఉండటం ఒక లాంఛనం. జాతీయ జంతువు హోదా కట్టబెట్టడం వల్ల పులులకు ఒరిగిందేమీ లేదు. ఒకప్పుడు మనదేశంలో అడవులు విస్తారంగా ఉండేవి. పులులు కూడా గణనీయంగానే ఉండేవి. గడచిన వందేళ్లలో అడవుల విస్తీర్ణం బాగా తగ్గిపోయింది. పులుల సంఖ్య మరీ దారుణంగా తగ్గిపోయింది. పులులు ఇక అంతరించిపోతాయా అనే ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇటీవల సేకరించిన పులుల జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో గడచిన మూడేళ్లలో వాటి సంఖ్య ముప్ఫయి శాతం మేరకు పెరిగింది. ఇదొక ఆశాజనకమైన పరిణామం. ఇదే పరిస్థితి ఇంకొన్నేళ్లు నిరంతరాయంగా ఇలాగే కొనసాగితే పులుల మనుగడకు మరేమీ ఢోకా ఉండదు. పులిని చూసి భయపడినోడు పిరికోడు... పులిని కాపాడుకున్నోడు నిజమైన భారతీయుడు... ఇవాళ పిల్లలు భయంతో కాదు... గర్వంగా అంటున్నారు... రాచఠీవికి, గాంభీర్యానికి ప్రతీక పులి. అప్రమత్తతకు, తెగువకు సంకేతం పులి. భీతిగొలిపే స్ఫురద్రూపానికి, తిరుగులేని శక్తికి, లక్ష్యంపైకి విజృంభించి వేటాడే పట్టుదలకు చెరగని చిరునామా పులి. పులుల కథ జానపద గాథల్లో పులులను ఎదుర్కొన్న సాహస వీరుల కథలను గగుర్పాటుతో ఆసక్తిగా ఆలకించిన జ్ఞాపకాలు చాలామందికి ఉండే ఉంటాయి. నరమాంసం రుచి మరిగిన పులులను వేటాడిన వేటగాళ్ల సాహసాలను కథలు కథలుగా చెప్పుకోవడం తెలిసే ఉంటుంది. జానపద గాథల్లోనే కాదు, పురాణాల్లోనూ పులుల ప్రస్తావన ఉంది. చాలామంది చిన్నప్పుడు సర్కస్‌లో లేదా జూ పార్కులో పులులను చూసి ఉంటారు. అవకాశం ఉన్నవాళ్లు అభయారణ్యాల్లో సఫారీకి వెళ్లినప్పుడు పులులను మరింత చేరువగా చూసి ఉంటారు. పులుల గురించి చిన్నప్పటి నుంచి కథలు కథలుగా చాలా సంగతులను, సామెతలను, పులితో పెనవేసుకుపోయిన పదబంధాలను వినే ఉంటారు. ముదురు పసుపు మేనిపై నలుపు తెలుపు చారలతో కనిపించే పులుల గురించి తమకు చాలా సంగతులు తెలుసనే చాలామంది అనుకుంటారు. అయితే, పులుల జీవనశైలి గురించి, వాటి వర్తమాన స్థితిగతుల గురించి తెలుసుకోవలసిన ఆసక్తికరమైన విషయాలు చాలానే ఉన్నాయి. ప్రపంచంలో పులుల సంఖ్య అంతరించిపోయే దశకు చేరుకోవడంతో మేల్కొన్న అంతర్జాతీయ సంస్థలు పులుల సంరక్షణపై అవగాహన పెంపొందించే ఉద్దేశంతో 2010 నవంబర్ 24న సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో మొట్టమొదటి పులుల సదస్సును నిర్వహించాయి. ఆ సదస్సు జూలై 29న అంతర్జాతీయ పులుల దినంగా పాటించాలని తీర్మానించింది. అప్పటి నుంచి ప్రపంచ దేశాలు... ముఖ్యంగా పులుల జనాభా గల దేశాలు అంతర్జాతీయ పులుల దినాన్ని పాటిస్తున్నాయి. పులులు... పుట్టుపూర్వోత్తరాలు జంతులోకంలో పులులదీ, పిల్లులదీ ఒకటే జాతి. అందుకే పులిని ‘బిగ్ క్యాట్’ అంటారు. ఇవి స్థూలంగా ‘ఫెలైన్’ జాతికి చెందినవి. ఇవన్నీ మాంసాహార జంతువులు. మనుగడ కోసం ఇతర జంతువులను వేటాడి తింటాయి. ‘ఫెలైన్’ జాతిలో 41 రకాల ఉపజాతులు ఉన్నాయి. ఇవన్నీ సుదీర్ఘ గతానికి చెందిన ఒకే జంతువు నుంచి పరిణామం చెందాయి. వీటిలో రెండు ప్రధాన వర్గాలు ఉన్నాయి. వీటిలో భారీగా ఉండి, అడవుల్లో సంచరించే అన్ని రకాల పులులు, చిరుతలు, సింహాలను ‘పాంథరీన్’ అంటారు. మిగిలిన రకాల పిల్లులను ‘ఫెలినే’ అంటారు. ‘ఫెలైన్’ జాతిలోని జంతువుల్లో పులులే పెద్దగా ఉంటాయి. ఎదిగిన మగపులి బరువు దాదాపు 250 కిలోల వరకు ఉంటుంది. ముక్కు నుంచి తోక వరకు పొడవు సుమారు పది అడుగుల వరకు ఉంటుంది. ఆడపులి బరువు సుమారు 160 కిలోలు, పొడవు దాదాపు ఎనిమిదిన్నర అడుగుల వరకు ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఒకప్పుడు మొత్తం తొమ్మిది జాతుల పులులు ఉండేవి. వాటిలో మూడు జాతుల పులులు పూర్తిగా అంతరించిపోయాయి. ప్రస్తుతం కేవలం ఆరు జాతుల పులులు మాత్రమే మనుగడ సాగిస్తున్నాయి. మనుగడ సాగిస్తున్న పులులు: రాయల్ బెంగాల్ టైగర్, ఇండో-చైనీస్ టైగర్, మలయన్ టైగర్, సైబీరియన్ టైగర్, సౌత్ చైనా టైగర్, సుమత్రన్ టైగర్ అంతరించిపోయిన పులులు: బాలీ టైగర్, కాస్పియన్ టైగర్, జావన్ టైగర్ పులుల రాజ్యం ప్రపంచంలో పులుల రాజ్యం టర్కీ నుంచి రష్యా తూర్పు తీరం వరకు విస్తరించి ఉండేది. గడచిన వందేళ్లలో పులులు తమ ఆవాసంలో 93 శాతం విస్తీర్ణాన్ని కోల్పోయాయి. అడవుల నరికివేత వల్ల, వేటగాళ్ల వల్ల వాటి జనాభా దాదాపు 97 శాతం మేరకు తగ్గిపోయింది. 1913 నాటి లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సుమారు లక్ష పులులు ఉండేవి. 2010 నాటికి వాటి సంఖ్య 3,200కు పడిపోయింది. తాజా లెక్కల ప్రకారం పులుల సంఖ్య 3890కి చేరుకుంది. వందేళ్లలో పులుల జనాభాలో తొలిసారిగా నమోదైన పెరుగుదల ఇది. ఇకపై కూడా ఇదే పరిస్థితి కొనసాగితే, 2022 నాటికి పులుల సంఖ్య రెట్టింపు కాగలదని వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) ఆశాభావం వ్యక్తం చేస్తోంది. భారత్, నేపాల్, భూటాన్, రష్యాలలో పులుల సంఖ్య బాగానే పెరిగింది.పులుల జీవితచక్రం ఆడపులి ఒక ఈతలో రెండు నుంచి ఆరు వరకు పిల్లలను పెడుతుంది. వీటిలో కొన్ని పూర్తిగా ఎదగక ముందే కన్నుమూస్తాయి. పుట్టినప్పుడు పులిపిల్ల బరువు ముప్పావు కిలో నుంచి ఒకటిన్నర కిలో వరకు ఉంటుంది. వాటికి మూడున్నర నెలల వయసు వచ్చేంత వరకు తల్లిపులి వాటిని తన స్థావరంలో ఉంచి, కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ఆ తర్వాత తల్లి వద్ద వేట మెలకువలు నేర్చుకుంటాయి. ఏడాదిన్నర వయసు వచ్చేసరికి సొంతంగా వేటాడే స్థితికి చేరుకుంటాయి. అయితే, రెండున్నరేళ్లు వచ్చేంత వరకు తల్లి వద్దే పెరుగుతాయి. తర్వాత తల్లిని విడిచిపెట్టి వాటి దారి అవి చూసు కుంటాయి. ‘హద్దు’మీరనివ్వవు అడవిలో సరిహద్దులను ఏర్పాటు చేసుకుంటాయి. సరిహద్దులను గుర్తించడానికి ఇవి ఎంపిక చేసుకున్న ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేస్తాయి. ఒకసారి ఇలా సరిహద్దులను ఏర్పాటు చేసు కున్న తర్వాత, ఆ సరిహద్దులు దాటి ఏ ఇతర జంతువులు ప్రవేశించినా దాడికి తెగబడతాయి. ఆడపులులు మూడున్నర నుంచి నాలుగేళ్ల వయసులోను, మగపులులు ఐదు నుంచి ఆరేళ్ల వయసు లోను పునరుత్పత్తి సామర్థ్యాన్ని సంతరించు కుంటాయి. పులుల ఆయుర్దా యం గరిష్ఠంగా 26 ఏళ్ల వరకు ఉంటుంది. అయితే, వేట, వైపరీత్యాలు, వ్యాధులు వంటి కారణాల వల్ల వాటి సగటు ఆయుర్దాయం పదేళ్లకు మాత్రమే పరిమితమవుతోంది. మృగయా వినోదంతోనే ముప్పు వేట ఒక వేలం వెర్రి. మృగయా వినోదం మన దేశంలో అనాదిగా ఉన్నదే. ఈ వినోదమే మనుషులకు చెలగాటం, పులులకు ప్రాణసంకటంగా పరిణమించింది. మొఘల్ చక్రవర్తుల కాలంలో పులుల వేట రాచరికపు సరదాగా ఉండేది. అక్బర్ చక్రవర్తి విరివిగా పులుల వేటలో పాల్గొనేవాడు. ఆ తర్వాత బ్రిటిష్ హయాంలోనూ మన దేశంలో పులుల వేట విచ్చలవిడిగా సాగినా, స్వాతంత్య్రం వచ్చే నాటికి కూడా పులుల సంఖ్య గణనీయంగానే ఉండేది. బ్రిటిష్ హయాంలో పులుల వేటలో పేరుమోసిన కొందరు పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో పులులను హతమార్చేవారు. కల్నల్ జెఫరీ నైటింగేల్ అనే బ్రిటిష్ సైనికాధికారి 1920ల కాలంలో ఏకంగా మూడువందల పులులను మట్టుబెట్టాడు. చరిత్రకారుడు మహేశ్ రంగరాజన్ అంచనా ప్రకారం 1875 నుంచి 1925 మధ్య కాలంలో వేటగాళ్ల తూటాలకు దాదాపు 80 వేల పులులు బలైపోయాయి. స్వాతంత్య్రానంతర కాలంలో ఇప్పటి ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా మహారాజా తాను 1150 పులులను వేటాడినట్లు 1965లో బహిరంగంగా చెప్పుకున్నాడు. అప్పట్లో రాజవంశీకులు, జమీందార్లు తాము వేటాడిన పులుల చర్మాలను ఇళ్లలో అలంకారంగా ఉంచుకునేవారు. పులిగోర్లతో పతకాలు తయారు చేయించుకుని, వాటిని మెడలో ధరించి దర్పాన్ని ప్రదర్శించేవారు. ఇక స్వాతంత్య్రానంతరం విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి మన ప్రభుత్వం అప్పట్లో ‘షికార్’ (వేట) కోసం భారత్ రావచ్చంటూ విదేశీ పత్రికల్లో ప్రకటనలు గుప్పించింది. అక్కడితో వేటగాళ్ల తాకిడి బాగా పెరిగి, పులుల సంఖ్య గణనీయంగా తగ్గింది. పులుల సంఖ్య దారుణంగా తగ్గిపోయిన దశలో చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ప్రభుత్వం మెలకువ తెచ్చుకుని పులుల సంరక్షణ కోసం 1972లో ‘ప్రాజెక్ట్ టైగర్’కు రూపకల్పన చేసింది. మన దేశంలో 1971 నాటికి పులుల సంఖ్య 1800కు పడిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ప్రాజెక్ట్ టైగర్ 1973 నుంచి అమలులోకి వచ్చింది. వన్యప్రాణి సంరక్షణ చట్టానికి 2006లో సవరణ తెచ్చి, జాతీయ పులుల ప్రాధికార సంస్థను ఏర్పాటు చేసింది. మన దేశంలో పులుల కోసం 47 అభయారణ్యాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే, పులులు సంచరించే దేశాలన్నీ కలసి 1993లో గ్లోబల్ టైగర్ ఫోరమ్‌గా ఏర్పడ్డాయి. జాతీయంగా, అంతర్జాతీయంగా పులుల సంరక్షణ కోసం దశాబ్దాలుగా సాగిస్తున్న కృషి ఇప్పుడిప్పుడే సత్ఫలితాలనిస్తోంది. వైద్యంలో పులి పులి శరీర భాగాలను వైద్యంలో ఉపయోగించే పురాతన పద్ధతి చైనాలో ఇప్పటికీ కొనసాగుతోంది. పులుల శరీర భాగాలతో తయారయ్యే ఔషధాలతో చాలా వ్యాధులు నయమవుతాయని వారి నమ్మకం. పులుల శరీర భాగాల్లో ఏయే భాగాలతో తయారయ్యే ఔషధాలను ఏయే వ్యాధులు నయమవుతాయని నమ్ముతారంటే... పులి పంజా : నిద్రలేమికి పులి కోరలు : జ్వరాలకు పులి కొవ్వు : కీళ్ల నొప్పులకు, కుష్ఠువ్యాధికి ముక్కు చర్మం : జంతువుల కాట్లకు పులి ఎముకలు : కీళ్ల నొప్పులు, పక్షవాతం, తలనొప్పులు, విరోచనాలు.... పులి కనుగుడ్లు : మూర్ఛవ్యాధికి, మలేరియాకు పులి తోక : రకరకాల చర్మవ్యాధులకు పులి మీసాలు : పంటి నొప్పులకు పులి మెదడు : మొటిమలకు, అలసటకు, బద్ధకానికి పులి మలం : తాగుడు మాన్పించడానికి, మూలవ్యాధికి పురుషాంగం : వాజీకరణ చికిత్సలో ఉపయోగిస్తారు పులుల గురించి అవీ ఇవీ... ≈ పులులు తమ సరిహద్దులను నిర్ణయించుకోవడానికి అవి ఎంపిక చేసుకున్న ప్రదేశాల్లో మూత్రం విసర్జిస్తాయని తెలిసిందే కదా! ఆ సరిహద్దుల నడుమ ఉన్న ప్రాంతాన్ని పులి తన రాజ్యంగా పరిగణిస్తుంది. మగ పులి రాజ్యం విస్తీర్ణం దాదాపు 60-100 చదరపు కిలోమీటర్లు ఉంటే, ఆడపులి రాజ్యం విస్తీర్ణం దాదాపు 20 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. ≈ సంతోషాన్ని వ్యక్తం చేసేందుకు పులులు ఇతర జంతువుల మాదిరిగా ధ్వనులు చేయలేవు. అయితే, కళ్లు మిటకరించడం ద్వారా లేదా తన్మయత్వంతో పూర్తిగా కళ్లు మూసుకోవడం ద్వారా అవి తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తాయి. ≈ నీట్లో ఈదులాడటమంటే పులులకు చాలా సరదా. నదులు, చెరువులు కనిపిస్తే ఒక్కోసారి గంటల తరబడి ఈతకొడుతూ గడిపేస్తాయి. నీట్లో దొరికే జలచరాలను వేటాడి తింటాయి. ≈ పులులకు కొంచెం మిమిక్రీ కూడా తెలుసు. పులులు, ఎలుగుబంట్లు తరచుగా ఒకదాని సరిహద్దుల్లోకి మరొకటి ప్రవేశిస్తుంటాయి. ఎలుగుబంట్లు తినే ఆహారాన్ని మాత్రమే కాదు, ఎలుగుబంట్లను కూడా పులులు వేటాడతాయి. తమ ప్రాంతంలో ఎలుగుబంటి ఏదైనా సంచరిస్తున్నట్లు అనుమానం వస్తే, ఎలుగుబంటికి ఎరగా ఉండే జంతువు ధ్వనులతో దానిని ఆకర్షించేందుకు పులి ప్రయత్ని స్తుంది. ఎర ఉందనుకుని వచ్చిన ఎలుగుబంటిపై దాడి చేస్తుంది. ≈ పులులు ఇతర జంతువులను చూసి గాండ్రించడం చాలా అరుదు. అవి ఒకదానితో మరొకటి సంభాషించుకోవ డానికి మాత్రమే గాండ్రిస్తాయి. పులి గాండ్రింపు కనీసం రెండు కిలోమీటర్ల వరకు వినిపిస్తుంది. ≈ పులుల కళ్లు సాధారణంగా పారదర్శకమైన పసుపు రంగులో ఉంటాయి. అయితే, తెల్లపులుల కళ్లు మాత్రం నీలిరంగులో ఉంటాయి. ఎక్కువగా పులులు గోధుమరంగు ఛాయ కలగలిసిన ముదురు పసుపు రంగులో ప్రస్ఫుటంగా కనిపించే నల్లని చారలతో ఉంటాయి. రంగునిచ్చే పిగ్మెంట్ లోపించిన పులులు తెల్లగా ఉంటాయి. తెల్లపులులు కూడా బెంగాల్ టైగర్ జాతికి చెందినవే. ≈ అత్యంత అరుదుగా కొన్ని పులులు పూర్తిగా తెల్లగా లేత రంగు చారలతో, బంగారు రంగులో, పూర్తి నలుపు రంగులో, నీలి రంగులో కూడా ఉంటాయి. ≈ పులులకు స్వల్పకాలిక జ్ఞాపకశక్తి మనుషుల కంటే మెరుగ్గా ఉంటుంది. మనుషులతో పోలిస్తే, వాటి స్వల్పకాలిక జ్ఞాపకశక్తి ముప్పయి రెట్లు ఎక్కువ. ≈ మగసింహానికి, ఆడపులికి పుట్టిన వాటిని ‘లైగర్’ అంటారు. మగపులికి, ఆడ సింహానికి పుట్టిన వాటిని ‘టైగన్’ అంటారు. ≈ పులి నుదుటి మీద కనిపించే చారల గుర్తుకు చైనా భాషలో ‘రాజు’ అర్థం ఉంది. మనుషుల వేలి ముద్రల్లానే పులుల చారలు కూడా దేనికదే ప్రత్యేకం. ఏ రెండు పులుల చారలూ ఒకేలా ఉండవు. ≈ సరదా కోసం పులులను పెంపుడు జంతువుల్లా పెంచుకునే సెలిబ్రిటీలు ఉన్నారు. బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ వద్ద రకరకాల జంతువులు, పక్షులతో పాటు పులులు కూడా ఉన్నాయి. తీరిక వేళల్లో టైసన్ పులులను ఆడించడమే కాకుండా, వాటితో కలసి నీటి కొలనులో జలకాలాడుతుంటాడు. పాప్‌స్టార్ పారిస్ హిల్టన్ కూడా ఒక పులిని పెంచుకుంటోంది. -
నేపాల్ జాతీయ జంతువుగా ఆవు
కఠ్మాండు: గోమాతను పవి త్రంగా భావించే నేపాల్‌లో ఆవును జాతీయ జంతువుగా ప్రకటించారు. ఆదివారం నుంచి అమల్లోకొచ్చిన కొత్త రాజ్యాంగంలో ఈ విషయాన్ని పొందుపరిచారు. ఖడ్గమృగాన్ని జాతీయ జంతువుగా పరిగణించాలని ప్రతిపాదనలు వచ్చినప్పటికీ చివరికి ఆవును ఎంపికచేశారు. దీంతో దానికి రాజ్యాంగ రక్షణ కల్పించినట్లయింది. దేశంలో గోవధను నిషేధించారు. ఈ అంశం రాజ్యాంగంలో లేనప్పటికీ చివరగా చేర్చారు. -
బర్రెను జాతీయ జంతువుగా ప్రకటించాలి
ప్రొఫెసర్ కంచ ఐలయ్య హైదరాబాద్: దేశంలో బర్రెలే అత్యధికంగా పాలు ఇస్తున్నందున బర్రెనే జాతీయ జంతువుగా ప్రకటించాలని ప్రొఫెసర్ కంచ ఐలయ్య పేర్కొన్నారు. దళితులు సైతం జాతీయ జంతువుగా పూజించాలన్నారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని అమలు చేయటంతో పాటు ప్రతి గ్రామంలో కిండర్ గార్డెన్ స్కూల్‌ను ఏర్పాటు చేయాలని, గర్భస్థ శిశువు నుంచి ప్రభుత్వమే పోషకాహారం అందించాలన్నారు. కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్‌వెస్లీ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం,సీనియర్ జర్నలిస్టు సతీష్ చంద్ర, సామాజికవేత్త సాంబశివరావు, రచయిత జయరాజు, ప్రజాశక్తి మాజీ సంపాదకులు వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.