ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్కు కేంద్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ 114వ జన్మదినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఢిల్లీలోని ధ్యాన్‌చంద్ స్టేడియంలో జెండా ఊపి ‘రన్ ఫర్ యూనిటీ’ మారదాన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ... ఏక్ భారత్ అనేది సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్లే సాధ్యమైందని, దేశ ప్రజలందరినీ ఒకే తిరంగా జెండా కింద ఉంచడానికి పటేల్ ఎనలేని కృషి చేశారని కొనియాడారు.