Sakshi News home page

భార్యాభర్తల బంధాన్ని తెంచిన అప్పులు

Published Tue, Sep 1 2015 7:38 AM

పనులు లేనప్పుడు కూలీ పనులకు వెళ్తుంటారు. వీరికి నలుగురు కూతుళ్లు సునీత, రజిత, వసంత, మమత, కుమారుడు అభిలాష్. తమకున్న రెండున్నరెకరాల భూమిని సాగు చేయడం కోసం కోబల్‌సింగ్ గతేడాది రూ.2 లక్షల అప్పు చేసి ఐదు బోర్లు వేయించాడు. రెండింట్లోనే నీళ్లు పడ్డాయి. కిందటేడాది చేనులో పత్తి సాగుచేశాడు. కరువుతో పంట అంతా ఎండిపోయింది. పెట్టుబడులు మట్టిపాలయ్యూయి. బోర్లను నమ్ముకుని ఈ ఖరీఫ్‌లో రెండెకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. వర్షాలు లేకపోవడంతో నెలరోజులుగా బోర్ల నుంచి నీరు రాలేదు. వారం క్రితమే రెండు బోర్లు ఎత్తిపోయాయి. నీరందక మొక్కజొన్న ఎదగలేదు. పంటలకు పెట్టుబడితోపాటు ఇద్దరు కూతుళ్లు సునీత, రజితల పెళ్లిళ్ల కోసం మొత్తం రూ.4 లక్షల అప్పులయ్యాయి. ఈసారి కూడా పెట్టుబడులు చేతికి వచ్చే పరిస్థితి లేకపోవడంతో కోబల్‌సింగ్‌కు దిక్కు తోచలేదు. అప్పులు, కుటుంబ పోషణపై దిగులు చెందాడు. అప్పుల విషయమై భార్యభర్తల మధ్య చిన్నచిన్న గొడవలు మొదలయ్యాయి.

Advertisement

What’s your opinion

Advertisement