కందుకూరు పట్టణంలో కాల్‌మనీ కేటుగాళ్లు మరోసారి బుసలు కొట్టారు. కోటకట్ట వీధికి చెందిన భార్యాభర్తలు ఓ వడ్డీ వ్యాపారి వద్ద తమ ఇంటిని తాకట్టుపెట్టి రూ. 7 లక్షలు వడ్డీకి అప్పుగా తీసుకున్నారు. అయితే రెండేళ్లు గడుస్తున్నా అప్పు తీరకపోవడంతో ఇంటిని బ్యాంకులో తాకట్ట పెట్టి రూ. 12 లక్షలు రుణం తీసుకున్నారు. కానీ కాల్‌మనీ వ్యాపారులు రంగంలోకి దిగారు. ప్రతి నెలా వడ్డీ దిగమింగుతోంది చాలక.. బ్యాంకు నుంచి వచ్చిన సొమ్మంతా దిగమింగారు. ఇదేంటని బాధితులు ప్రశ్నిస్తే మీకు దిక్కున్నచోట చెప్పుకొమ్మని గెంటివేశారు. దీందో బాధితులు వడ్డీ వ్యాపారి ఇంటిముందు మంగళవారం ఆందోళనకు దిగారు. వివరాలు.. మున్సిపాలిటీలోని 6వ వార్డు కోటకట్ట వీధికి చెందిన షాజహాన్, కరీమ భార్యాభర్తలు. ఈ నేపథ్యంలో పామూరు రోడ్డులోని ఉన్న ఎం. మాల్యాద్రి, ఆయన కుమారుడు నరసింహారావుకు సంబంధించిన స్థలాన్ని టిఫిన్ హోటల్ కోసం అద్దెకు తీసుకున్నారు.
కందుకూరులో మరో కాల్‌మనీ కహానీ
Jan 31 2018 2:59 PM | Updated on Mar 22 2024 11:20 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement