బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఫలితాలు చిత్రంగా వచ్చాయి. ముందునుంచి ఆధిక్యంలో ఉన్న శివసేన... చివరి నిమిషంలో తడబడగా, జీజేపీ మాత్రం పుంజుకుంది. శివసేన - బీజేపీ నువ్వా నేనా అన్నట్లుగా నిలిచాయి. మొత్తం 227 స్థానాలున్న కార్పొరేషన్‌లో శివసేన 84, బీజేపీ 81, కాంగ్రెస్ 31, ఎన్సీపీ 9, ఎంఎన్ఎస్ 7, ఇతరులు 13 చోట్ల గెలిచారు. దాంతో అధికారం చేపట్టాలంటే కావల్సిన కనీస స్థానాలు.. 114 మ్యాజిక్ ఫిగర్ ఎవరికీ దక్కలేదు. ఇప్పటివరకు శివసేన - బీజేపీ కలిసి మహారాష్ట్రలో పోటీ చేయగా, ఇప్పుడు ఈ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి.