స్మార్ట్ ఫోన్ తీసుకోవాలనుకుంటే మీరేం చేస్తారు.. మొబైల్ స్టోర్స్కు వెళ్లారా? లేక ఆన్లైన్లో కొనేద్దాం అనుకుంటారా? ఆన్లైన్లో కొనేటట్లయితే మాత్రం ముందునుంచి జాగ్రత్త పడాల్సిందే. ఒకటికి రెండుసార్లు చూసుకోవాల్సిందే. కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన సృచరణ్ అలా చూసుకున్నా కూడా షాక్ తిన్నారు మరి. ఎందుకంటారా.. ఆయన తన క్రెడిట్ కార్డు ద్వారా రూ. 8,099 చెల్లించి ఫోన్ కొంటే, తీరా కొరియర్లో వచ్చిన బాక్సు తెరిచి చూసేసరికి అందులో ఫోనుకు బదులు రెండు మామిడిపండ్లు కనిపించాయి!! కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన సృచరణ్ ఓ ప్రముఖ ఈ-టైలింగ్ సైట్లో మెగా సేల్ ఆఫర్‌ను చూశాడు. ఇందులో... ఆసుస్ వెస్ ఫైవ్ ఫోన్ చూసి ముచ్చటపడ్డాడు. మే26న క్రెడిట్ కార్డు ద్వారా 8099 రూపాయలు పెట్టి ఫోన్‌ను ఆర్డర్ చేశాడు. అలా బుక్ చేసుకున్న ఫోన్... ఈ నెల 8న అతని చేతికి వచ్చింది. కొరియర్ బాయ్ తెచ్చిన బాక్స్ ఓపెన్ చూసిన అతనికి దిమ్మతిరిగిపోయింది. ఫోన్ బుక్ చేస్తే.. రెండు మామిడిపండ్లు అందులో కన్పించటంతో షాక్‌తిన్నాడు. దీంతో... ఫోన్ బుక్ చేస్తే... మామిడిపళ్లు పంపారంటూ... కస్టమర్ కేర్‌కు కాల్ చేశాడు. వాళ్ల దగ్గరి నుంచి సరైన రెస్పాన్స్ అందలేదు. విచారణ జరుపుతామంటూ... చేతులు దులిపేసుకున్నారు. దీంతో.. జరిగిన విషయాన్ని మీడియా దృష్టికి తీసుకొచ్చాడు బాధితుడు సృచరణ్. తనకు న్యాయం జరగకుంటే.. త్వరలో వినియోగదారుల కోర్టును ఆశ్రయిస్తానన్నారు. తప్పనిసరిగా అతడి కేసు వినియోగదారుల ఫోరానికి సంబంధించినదేనని, కేసు నమోదుచేస్తే ఫోను ఖరీదుతో పాటు నష్టపరిహారం కూడా అందుతుందని వినియోగదారుల ఫోరానికి చెందిన శ్రీనివాస్ తెలిపారు.
Jun 11 2015 7:11 PM | Updated on Mar 21 2024 6:38 PM
Advertisement
Advertisement
Advertisement
