అమెరికాలో జరిగిన విమాన ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. ఉత్తర నెవెడాలో ఎయిర్ అంబులెన్స్ విమానం కూలిపోవడంతో శుక్రవారం రాత్రి ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. గుండె సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న రోగిని ఉతాహ్ ఆస్పత్రికి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రెండు ఇంజిన్లు కలిగిన ఈ విమానం కాసినో సమీపంలోని ప్రైవేటు మైనింగ్ కంపెనీకి చెందిన పార్కింగ్ ప్రదేశంలో కూలిపోయింది. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. రోగితో పాటు విమానంలో ఉన్న ముగ్గురు సిబ్బంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో మహిళ కూడా ఉన్నారు.
Nov 20 2016 11:20 AM | Updated on Mar 21 2024 8:11 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement