ప్రభుత్వం తీరుతో రైతు గుండె ఆగింది | Farmer died with heart attack due to afraid of losing his land | Sakshi
Sakshi News home page

Sep 12 2015 12:24 PM | Updated on Mar 21 2024 6:45 PM

అంతర్జాతీయ విమానాశ్రయం కోసం తన భూమిని తీసుకోవాలని టీడీపీ ప్రభుత్వం యత్నిస్తుండటంతో మనస్తాపానికి గురైన ఓవ రైతు గుండెపోటుతో మృతిచెందాడు. ఈ ఘటన విజయనగరం జిల్లా భోగాపురం మండలం వెంపాడుపేటలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భోగాపురంలో నిర్మించ తలపెట్టిన అంతర్జాతీయ విమానాశ్రయం కోసం అధికారులు నేడు నోటీసులు జారీ చేయనున్నారు. తన భూమిని కోల్పోతానన్న భయాందోళనతో సూరి అనే రైతు మనస్తాపానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలోనే సూరి అనే రైతుకు పొలం చేజారుతుందేమోనన్న దిగులుతోనే గుండెపోటు వచ్చిఅతను మృతి చెందినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఎయిర్ పోర్టు నిర్మాణానికి తమ భూములు ఇచ్చేందుకు సిద్ధంగాలేనట్లు రైతులు గతంలోనే తేల్చిచెప్పారు. కానీ ప్రభుత్వం తొందరపాటు నిర్ణయాలతో రైతన్నలు బలైపోతున్నా మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఏమాత్రం పట్టించుకోవడంలేనట్లు కనిపిస్తోంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement