సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన రాజీనామా, కొత్త పార్టీ విషయమై చర్చలు జరుపుతున్నారు. భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు చేస్తున్నారు. ఆరుగురు ఎంపీల బహిష్కరణ నేపథ్యంలో సీఎం చర్చలు కొనసాగిస్తున్నారు. ఎల్లుండి అసెంబ్లీ వేదికగా సిఎం మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒక అక్కడ మాట్లాడటానికి కుదరకపోతే ప్రెస్‌మీట్ పెట్టి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించే అవకాశం ఉంది.