ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఆగస్ట్ 2న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన రాష్ట్రవ్యాప్త బంద్కు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి శనివారమిక్కడ మాట్లాడుతూ వైఎస్ఆర్ సీపీ చేపట్టిన ఏపీ బంద్ విజయవంతం కావాలన్నారు. టీడీపీ, బీజేపీ చీకటి ఒప్పందాల వల్లే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ ఎంపీలకు అసెంబ్లీ సీట్ల పెంపుపై ఉన్న శ్రద్ధ ప్రత్యేక హోదాపై లేదని రఘువీరా విమర్శించారు.