కేంద్ర కేబినెట్ పునర్వ్యస్థీకరణకు ఈనెల 3న ముహూర్తం ఖరారయింది. ఆదివారం ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో జరిగే కార్యక్రమంలో కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు చైనాకు బయలుదేరనున్నారు.