పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ పంద్రాగస్టు నాడే వినియోగంలోకి తీసుకురావాలని మొండిపట్టుపట్టిన ప్రభుత్వం చివరకు వెనక్కి తగ్గింది. పనులు కొలిక్కిరాని నేపథ్యంలో ఆ రోజున నీటిని విడుదల చేయడం కాకుండా.. కనీసం ఆ పథకాన్ని ప్రజలకు అంకితం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆగస్టు 15న ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు పట్టిసీమ రానున్నారు.