కొత్త సీఎం ఛాంబర్ ప్రారంభించిన చంద్రబాబు | CM Chandrababu Naidu enters in to new chamber | Sakshi
Sakshi News home page

Oct 12 2016 3:29 PM | Updated on Mar 22 2024 10:55 AM

వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో తన ఛాంబర్ ను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం ప్రారంభించారు. నిర్ణీత ముహూర్తానికి వేదపండితుల ఆధ్వర్యంలో సచివాలయం మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం లాంఛనంగా కొత్త ఆఫీసులోకి అగుడు పెట్టారు. ముందుగా ఆయన డ్వాక్రా మహిళలకు రెండో విడత రుణమాఫీ ఫైలుపై సంతకం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రులుమంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, నారాయణ, కొల్లు రవీంద్ర, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. అనంతరం దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు కూడా తమ కార్యాలయాన్ని ప్రారంభించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement