ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్‌ను అంతర్జాతీయ సమాజం ముందు భారత్ మరోసారి దోషిగా నిలబెట్టింది. ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ ఆర్థిక, ఆయుధ సహకారంపై అంతర్జాతీయ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్) ఆగ్రహం వ్యక్తం చేసింది. పాకిస్తాన్ కేంద్రంగా ఉన్న ఉగ్రవాద సంస్థలు లష్కరే తోయిబా, జమాత్ ఉద్ దవా ఆస్తులను తక్షణమే సీజ్ చేయాలని ఎఫ్‌ఏటీఎఫ్ స్పష్టం చేసింది.