భోగాపురంలో విమానాశ్రయం ఏర్పాటుకు స్థల పరిశీలనకు వచ్చిన సర్వే బృందాన్ని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అడ్డుకున్నారు. తమ భూములు ఇవ్వబోమంటూ కొయ్యపేట గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయబోయారు. పక్కనే ఉన్న మహిళలు అప్రమత్తమవటంతో ప్రమాదం తప్పింది. చీపుర్లు, చాటలు చేతపట్టుకుని సర్వేయర్లను ఊరి బయటకు తరిమారు. కారిగొల్లపేట గ్రామస్తులు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. భోగాపురం ఎయిర్‌పోర్టు సర్వేను వెంటనే ఆపేయాలని డిమాండ్ చేస్తూ అధికారులకు శాపనార్ధాలు పెట్టారు.
Jul 4 2015 4:11 PM | Updated on Mar 22 2024 10:59 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement