బీసీ కులాల్లోని అన్ని కుటుంబాలకు వ్యక్తిగతంగా సాయం అందించే కార్యక్రమాలను రూపొందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. కులాల వారీగా ప్రత్యేక పథకాలు, కార్యక్రమాలను రూపొందించి వచ్చే నెల నుంచే అమలు చేయాలని స్పష్టం చేశారు. సమాజంలో సగభాగం ఉన్న బీసీల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి జరగాలన్నారు. ‘‘బీసీలలో ప్రతీ కులానికి ఓ ప్రత్యేక పని, ప్రత్యేక జీవనం ఉన్నాయి. దానికి అనుగుణంగానే కార్యక్రమాల రూపకల్పనలో కూడా వైవిధ్యం ఉండాలి’’అని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. బీసీ కులాల అభ్యున్నతికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై సీఎం కేసీఆర్ శనివారం ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు.