తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం రసాబాసగా మారింది. సైదాబాద్ సరస్వతీ శిశు మందిర్ లో సోమవారం ఏర్పాటు చేసిన చీరల పంపిణీ కార్యక్రమంలో మహిళలు కొట్టుకున్నారు. క్యూ లైన్లలో తలెత్తిన వివాదం.. ఒకరినొకరు సిగలు పట్టుకుని చెప్పులతో కొట్టుకునే వరకు వెళ్లింది.