ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహారశైలిపై ఆంధ్రప్రదేశ్ పోలీసులలో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తమవుతున్నాయి. పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం ఎంతవరకు సబబన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రధానంగా ఇంటెలిజెన్స్ చీఫ్ అనూరాధపై వేటు వేస్తారన్న కథనాలు సీనియర్ ఐపీఎస్ అధికారుల ఆగ్రహానికి కారణం అవుతున్నాయి.