బంగ్లాదేశ్లో పేలుళ్లకు పాల్పడి పలువురి ప్రాణాలు బలిగొన్న ఐఎస్ఐఎస్ తదుపరి లక్ష్యం భారతదేశమేనా? ప్రధానంగా హైదరాబాద్ లాంటి నగరాల్లో తమ సానుభూతిపరుల ద్వారా ఉగ్రదాడులు చేయించడానికి ఐఎస్ పావులు కదుపుతోందా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే అవుననే అనిపిస్తోంది. తాజాగా హైదరాబాద్ నగరంలోని సంతోష్నగర్ ప్రాంతంలో మరో ఐసిస్ సానుభూతిపరుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈదీబజార్ ప్రాంతానికి చెందిన నిజాముద్దీన్గా ఆ సానుభూతిపరుడిని గుర్తించారు. అతడిని విచారణ నిమిత్తం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కార్యాలయానికి తరలించారు