పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి సీఎం చంద్రబాబు ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...గత అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లా ప్రజలు టీడీపీకి 15 సీట్లిచ్చి పూర్తి మద్దతు పలికారని, పట్టిసీమ ఎత్తిపోతల పథకంతో వారి రుణం తీర్చుకుంటానన్నారు. జిల్లాలో నిట్, మెరైన్ ఇంజనీరింగ్ యూనివర్శిటీలు ఏర్పాటుచేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో వచ్చే నాలుగేళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు.