శరీర లోపలి భాగాలను పరీక్షించేందుకు ఎక్స్ రేలు, స్కానింగ్ లు తీయించే కాలం చెల్లి పోయింది. ప్రతి పనికీ రోబోను వినియోగిస్తున్నట్లే ఇకపై వైద్య పరీక్షల్లోనూ రోబోల ప్రాధాన్యత మరింత పెరగనుంది. ఇప్పుడు శరీరంలోని ఆరోగ్య పరిస్థితులను పరిశీలించేందుకు పరిశోధకులు ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించి అతిచిన్న రోబోను సృష్టించారు. ఆ సూక్ష్మ పరికరం కడుపులో ఈతకొడుతూ, అన్నివైపులకు సంచరిస్తూ రోగికి సంబంధించిన ప్రతివిషయాన్నీ పరిశీలించి వివరాలను వెల్లడిస్తుంది. ఎస్ఏడబ్ల్యూ (సా..) పేరున తరంగంలా నడిచే రోబోను వైద్యపరీక్షలకోసం ప్రవేశ పెట్టడం ఇదే మొదటిసారి.