ఏబీవీపీ విద్యార్థుల ఆందోళనతో జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లారు.