రాష్ట్రంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు కింద రబీ సాగుకు జల గండం పొంచి ఉంది. సాగర్ కింద ఆయకట్టు లక్ష్యాలు ఘనంగా ఉండటం.. నీటి లభ్యత తక్కువగా ఉండటం ఆయకట్టు రైతాంగాన్ని కలవరపెడుతోంది. ఇప్పటికే పంటల సాగు మొదలైన నేపథ్యంలో... రానున్న రోజుల్లో ఏమేరకు నీటి విడుదల ఉంటుందన్న దానిపై స్పష్టత లేకపోవడం, కృష్ణా బోర్డు తీరును బట్టి గరిష్టంగా 8 నుంచి 10 టీఎంసీలు మాత్రమే దక్కవచ్చన్న అంచనాలతో ఆందోళన నెలకొంది. ఇదే జరిగితే గతేడాది మాదిరే ఈసారి కూడా 6 లక్షల ఎకరాల రబీ సాగుకు నీటి కటకట తప్పని పరిస్థితి కనిపిస్తోంది.