15 మంది ఎంపీటీసీలు కిడ్నాప్‌ | Sakshi
Sakshi News home page

15 మంది ఎంపీటీసీలు కిడ్నాప్‌

Published Sun, Jul 13 2014 8:39 AM

స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎంపీపీ పీఠం పోటాపోటీ నెలకొంది. నేడు స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎంపీపీ ఎన్నిక జరగనుంది. ఎన్నిక కోసం వస్తున్న 15 మంది ఎంపీటీసీలు కిడ్నాప్‌ కు గురయ్యారు. జనగామ మండలం పెంబర్తి వద్ద ప్రత్యర్థి వర్గం దాడి చేసి వీరిని అపహరించినట్టు చెబుతున్నారు. ఇక్కడ టీఆర్ఎస్ ఆధిక్యం సాధించినప్పటికీ ఉప ముఖ్యమంత్రి టి. రాజయ్య, ఎంపీ కడియం శ్రీహరి వర్గాల మధ్య ఆధిపత్య పోరు జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఎంపీటీసీల కిడ్నాప్ జరిగినట్టు చెబుతున్నారు.