టాలీవుడ్ హీరో మంచు మనోజ్ త్వరలో పెళ్లికొడుకు కాబోతున్నాడు. ప్రణతిరెడ్డిని వివాహమాడబోతున్నాడు. త్వరలోనే వీరిద్దరి వివాహ నిశ్చితార్థం జరగనుంది. ఈ విషయాన్ని మోహన్ బాబు కుటుంబం ధ్రువీకరించింది. బిట్స్ పిలానీలో ఇంజినీరింగ్ చదువుకుంటున్న ప్రణతిరెడ్డి మంచు ఫ్యామీలికి సన్నిహితురాలే. మంచు విష్ణు భార్య వెరోనికాకు ఆమె స్నేహితురాలు. కొంతకాలంగా ప్రేమించుకుంటున్న మనోజ్, ప్రణతి వివాహానికి పెద్దలు అంగీకరించడంతో త్వరలోనే మంచువారింట పెళ్లి బాజాలు మోగనున్నాయి. కాగా, పటాస్ సినిమా విజయం సాధించినందుకు కళ్యాణ్ రామ్ కు ట్విటర్ లో మనోజ్ అభినందనలు తెలిపాడు.