అందాల భామలు కర్ర సాము, కత్తి యుద్ధ విన్యాసాలతో అభిమానులను తెగ ఎట్రాక్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ లో టాప్ హీరోయిన్లుగా చలామణి అవుతున్న సమంత కర్ర సాముతో ఆకట్టుకుంటే, శృతిహాసన్ కత్తి ఫైట్‌తో వార్తల్లోనిలిచింది. భారీ బడ్జెట్‌తో తెరకెకకునున్న చారిత్రాత్మక సినిమా ‘సంఘమిత్ర’లో లీడ్ రోల్‌కు ఎంపికైన శృతి పూర్తిగా సినిమా మూడ్‌లోకి మారిపోయినట్టు కనిపిస్తోంది. నిపుణుల సమక్షంలో కత్తి యుద్ధం, మల్ల యుద్ధం వంటివి బాగా ప్రాక్టీసు చేస్తోంది. దీనికి సంబంచిన ఓ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది ఈ అమ్మడు. మార్షల్ ఆర్ట్స్ నా జీవితంలో భాగం అయినప్పటికీ, ఈ ప్రాజెక్టుకోసం కత్తి ఫైటింగ్ నేర్చుకోవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొంది.
Apr 20 2017 7:18 PM | Updated on Mar 21 2024 8:11 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement