హాలీవుడ్ స్థాయి విజువల్స్ తో 'వివేగం' | Ajith Kumar Vivegam Trailer | Sakshi
Sakshi News home page

Aug 17 2017 10:38 AM | Updated on Mar 22 2024 11:03 AM

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ వివేగం. అజిత్ హీరోగా వీరం, వేదలం లాంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమా భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కింది వివేగం. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ యూట్యూబ్ రికార్డ్ లన్నింటినీ చెరిపేయగా.. తాజాగా రెండున్నర నిమిషాల నిడివితో ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో అజిత్ ఇంటర్పోల్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. తొలిసారి కాజల్.. అజిత్ తో జత కట్టగా అక్షర హాసన్ కీలక పాత్రలో నటించింది. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా మీద అంచనాలను మరింత పెంచేసింది. హాలీవుడ్ స్థాయి విజువల్స్ తో పాటు అనిరుద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్బ్ గా ఉన్నాయి. వివేగం తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఆగస్ట్ 24న రిలీజ్ కు రెడీ అవుతోంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement