బ్యాంకు డిపాజిట్లు, రియల్ ఎస్టేటు, షేర్లు మాత్రమే కాదు. నమ్మకమైన ఇన్వెస్ట్‌మెంట్లలో బంగారం ఒకటి. ఎందుకంటే అది ఆభరణాల రూపంలో అందానికి మెరుగులు దిద్దటమే కాదు. ఏటా ధర పెరుగుతూ ఇన్వెస్ట్‌మెంట్ రూపంలో లాభాన్నీ ఇస్తుంది. అవసరమైనపుడు తనఖా పెట్టినా, అమ్మినా వెంటనే నగదు చేతికొచ్చేస్తుంది. వీటన్నిటికీ తోడు... ఎన్నేళ్లయినా ఎంచక్కా దాచుకోవచ్చు. ఇన్ని సుగుణాలున్నాయి కాబట్టే భారతీయులకు పసిడిపై తగని మోజు. పిల్లలు... ప్రత్యేకించి ఆడపిల్లలు పుడితే... వారి జీవితంలో ప్రతి సందర్భంలోనూ తల్లిదండ్రులు తమకు వీలైనంత బంగారాన్ని కొని వెనకేస్తుంటారు.