నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోదీ నిర్ణయం ప్రకటించిన అనంతరం భారీగా బంగారం అమ్మకాలు జరిగినట్టు తెలిసింది. అయితే ఎంత బంగారం విక్రయించుంటారనే దానిపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సెంట్రల్ ఎక్స్చేంజ్ ఇంటిలిజెన్స్ జరిపిన సర్వేలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం 48 గంటల్లో జువెల్లర్ వర్తకులు 4 టన్నులకు పైగా బంగారాన్ని విక్రయించారని తేలింది. వాటి విలువ రూ.1,250 కోట్లకు పైగా ఉంటుందని తెలిసింది. పెద్దనోట్లను రద్దుచేస్తున్నట్టు రాత్రి ఎనిమిది ప్రకటించిన రోజునే దాదాపు రెండు టన్నుల బంగారం కొనుగోళ్లు జరిగాయట.