రాజంపేట రూరల్: ఆరుగాలం కష్టించి సాగుచేసిన అరటిపంట చేతికివచ్చే సమయంలో బుధవారం రాత్రి దూసుకొచ్చిన గాలివానకు 15 ఎకరాల్లో అరటి నేలకొరిగింది. దాదాపు రూ. 15 లక్షలకు పైగా రైతులకు నష్టం వాటిల్లినట్లు ఉద్యాన అధికారులు తెలియజేస్తున్నారు. మండల పరిధిలోని పెద్దకారంపల్లి, బ్రాహ్మణపల్లి పంచాయతీలలోని రైతు భరోసా కేంద్రాల పరిధిలో నలుగురు రైతులకు చెందిన అరటిపంట నేలకొరిగింది. ఉద్యాన అధికారి జి. సునీల్‌తో పాటు సంబంధిత ఆర్‌బీకే సిబ్బంది నేలకొరిగిన అరటిపంటను పరిశీలించారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నట్లు వారు తెలియజేశారు.


