‘సర్‌’పై అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

‘సర్‌’పై అప్రమత్తంగా ఉండాలి

Apr 5 2026 7:54 AM | Updated on Apr 5 2026 7:54 AM

కడప కార్పొరేషన్‌: స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(సర్‌)పై వైఎస్సార్‌సీపీ నాయకులు అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, జోనల్‌ అధ్యక్షుడు భరత్‌ కుమార్‌ హెచ్చరించారు. శనివారం సాయంత్రం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కోర్‌ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సర్వే జరిగిన 12 రాష్ట్రాల్లో లక్షల ఓట్లను తొలగించారని, పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో 93లక్షల ఓట్లు తొలగించారన్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిడి భరించలేక ఉత్తరప్రదేశ్‌లో 7 మంది బీఎల్‌ఓలు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు. 24 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ కార్యక్రమం జరగలేదన్నారు. డబుల్‌ ఎంట్రీలు, చనిపోయిన వారి ఓట్లను ఇందులో తొలగిస్తారన్నారు. ఈనెల 15 నుంచి రాష్ట్రంలో ఈ కార్య క్రమం ప్రారంభమయ్యే అవకాశముందన్నారు. ఉద్యోగ నిమిత్తం వేరే చోట ఉన్నవారు, విదేశాలకు వెళ్లిన వారి ఓట్లు తొలగించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇలా జరగాలంటే సమర్థులైన వారిని బీఎల్‌ఏలుగా నియమించుకోవాలన్నారు. బీఎల్‌ఓలతోపాటు వైఎస్సార్‌సీపీ నియమించిన బీఎల్‌ఏలు కూడా ఈ వెరిఫికేషన్‌లో పాల్గొంటే ఉపయోగముంటుందని తెలిపారు. దీనిపై నియోజకవర్గాల, జిల్లా స్థాయిలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అలాగే రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీం పనులు పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్‌సీపీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించిందని, దాన్ని అందరూ విజయవంతం చేయాలన్నారు. అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, కడప పార్లమెంటు పరిశీలకులు కొండూరు అజయ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పి. రామసుబ్బారెడ్డి, డీసీ గోవిందరెడ్డి, రామచంద్రారెడ్డి, రమేష్‌ యాదవ్‌, బద్వేల్‌ ఎమ్మె ల్యే సుధ, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, కమలాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి నరేన్‌, మాజీ మేయర్‌ పాకా సురేష్‌, సీఈసీ సభ్యులు ఏ. మల్లికార్జునరెడ్డి, ఎస్‌ఈసీ సభ్యులు మాసీమ బాబు, రాష్ట్ర కార్యదర్శులు రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, గురుమోహన్‌, పోరెడ్డి నరసింహారెడ్డి, సంబటూరు ప్రసాద్‌రెడ్డి, కె. నాగేంద్రారెడ్డి, రాజగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

ఈ సర్వే జరిగిన 12 రాష్ట్రాల్లో లక్షల ఓట్లు తొలగించారు

సమర్థులైన వారిని బీఎల్‌ఏలుగా నియమించుకోవాలి

వైఎస్సార్‌సీపీ కోర్‌ కమిటీ సమావేశంలోజిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement