గాలిమరల నిర్మాణానికి భూముల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

గాలిమరల నిర్మాణానికి భూముల పరిశీలన

Apr 5 2026 7:54 AM | Updated on Apr 5 2026 7:54 AM

గాలిమరల నిర్మాణానికి భూముల పరిశీలన

ముద్దనూరు: మండలంలోని పలు గ్రామాల పరిధిలో ఏర్పాటు చేయనున్న గాలిమరల విద్యుత్‌ ఉత్పత్తికి అవసరమైన భూములను జేసీ నిధిమీనా పరిశీలించారు. శనివారం మండలంలోని బొందలకుంట, చింతకుంట, మంగపట్నం, కొలవలి, ఉప్పలూరు, పెద్దదుద్యాల గ్రామాల పరిధిలోని ప్రభుత్వ భూములలో ఆంపస్‌ విండ్‌ మిల్స్‌ కంపెనీ నిర్మించే గాలిమరలకు కేటాయించాల్సిన భూములను జేసీ మీనా స్థానిక ఆర్డీవో శిరీషతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ భూముల వివరాలు సేకరించారు.

సోలార్‌ ప్రాజెక్టు కోసం...

తొండూరు: తొండూరు మండలం మల్లేల గ్రామ సమీపంలోని మాలే గంగమ్మ ఆలయ సమీపంలో సోలార్‌ ప్రాజెక్టు నిర్మాణం కోసం శనివారం జేసీ నిధి మీనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా స్థలానికి సంబంధించిన మ్యాప్‌లను పరిశీలించారు. స్థల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement