పదోతరగతి పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలి | - | Sakshi
Sakshi News home page

పదోతరగతి పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలి

Feb 19 2026 9:53 AM | Updated on Feb 19 2026 9:53 AM

పదోతర

పదోతరగతి పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలి

భక్తిశ్రద్ధలతో చండీహోమం

కడప సెవెన్‌రోడ్స్‌ : మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్‌ ఒకటి వరకు జరుగు పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షల నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర్‌ నాయుడు పేర్కొన్నారు. బుధవారం జిల్లా సచివాలయంలోని బోర్డ్‌రూమ్‌లో పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షల నిర్వహణ పై సంబంధిత శాఖల అధికారులతో డీఆర్‌ఓ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షలకు సంబంధిత శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. మార్చి 2 నుంచి మార్చి 13 వరకు జరగనున్న ఓపెన్‌ స్కూల్‌ ఇంటర్మీడియట్‌ పరీక్షల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యాశాఖ, పోలీసు, వైద్య ఆరోగ్యశాఖ, విద్యుత్‌, మున్సిపల్‌, పోస్టల్‌ శాఖ అధికారులతో మాట్లాడి తగు సూచనలు చేశారు. ఈ సమావేశంలో డీఈఓ షంషుద్దీన్‌ పాల్గొన్నారు.

ఎకై ్పజ్‌ సీఐని అడ్డుకున్న

గ్రామస్తులు

తొండూరు : మండలంలోని సంత కోవూరు గ్రామంలో బుధవారం రాత్రి ముద్దనూరు ఎకై ్సజ్‌ సీఐ వినీలను గ్రామస్తులు అడ్డుకున్నారు. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఎకై ్సజ్‌ సీఐ రాత్రి సంత కొవ్వూరు గ్రామానికి వెళ్లారు. అక్కడ బెల్ట్షాప్‌ నిర్వహిస్తున్న వారి దగ్గరికి వెళ్లి మద్యం బాటిల్‌ తీసుకుని ఎమ్మార్పీ కంటే అధిక ధరకు అమ్ముతున్నారని, మీకు బెల్ట్‌ షాపు నిర్వహణకు ఎవరు అనుమతులు ఇచ్చారని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు సీఐ వాహనాన్ని చుట్టుముట్టారు. గ్రామాలకు బెల్ట్‌షాపులు ఇవ్వకుంటే సరిపోతుంది కదా.. మా గ్రామంలోకి వచ్చి ఎందుకు దాడు చేస్తున్నారని ప్రశ్నించారు. ఓ బెల్ట్‌షాపు నిర్వాహకుడిని ఎకై ్సజ్‌ పోలీసులు వాహనంలో ఎక్కించేందుకు ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు.రాత్రిపూట వచ్చి దాడులు చేసి..సంతకాలు పెట్టించుకుంటారా అంటూ ప్రశ్నించారు. దీంతో ఎకై ్సజ్‌ అధికారులు గ్రామం నుంచి జారుకున్నారు. విషయంపై ముద్దనూరు ఎకై ్సజ్‌ సీఐ వినీలను వివరణ కోరగా బుధవారం రాత్రి సంతకోవూరుకు వెళ్లిన విషయం వాస్తవమని, బెల్ట్‌ షాపులు నిర్వహించకూడదని చెప్పి వచ్చినట్లు తెలిపారు.

మల్లెంకొండేశ్వరస్వామికి రూ.9.53 లక్షల ఆదాయం

గోపవరం : శివరాత్రి పర్వదినం సందర్భంగా నిర్వహించిన మల్లెంకొండేశ్వస్వామి బ్రహ్మోత్సవాలకు హుండీ ద్వారా రూ.9,52,982లు ఆదాయం వచ్చినట్లు బద్వేలు దేవదాయశాఖ ఈవో ఎస్‌.రామలింగారెడ్డి తెలిపారు. బుధవారం బద్వేలు పట్టణంలోని శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయ ఆవరణలోని దేవదాయశాఖ కార్యాలయంలో పర్యవేక్షణాధికారి శివయ్య ఆధ్వర్యంలో మల్లెంకొండేశ్వరస్వామి హుండీ ఆదాయాన్ని లెక్కించినట్లు ఆయన తెలిపారు. మల్లెంకొండేశ్వరస్వామి ఆలయానికి సంబంధించి రూ.9,52,982, 21 గ్రాముల బంగారం, 120 గ్రాములు వెండి వచ్చినట్లు తెలిపారు. అలాగే దిగువ మల్లెంకొండేశ్వరస్వామి ఆలయానికి సంబంధించి రూ.93,285లు హుండీ ద్వారా వచ్చిందన్నారు. ఇప్పటికే తలనీలాలకు సంబంధించి రూ.5.70 లక్షలు వేలంపాట ద్వారా వచ్చిందన్నారు. కార్యక్రమంలో మల్లెంకొండేశ్వరస్వామి ఆలయ చైర్మన్‌ మల్లెంకొండయ్య, ఏపీఐఐసీ డైరెక్టర్‌ ప్రసాదరెడ్డి, బద్వేలు రూరల్‌ సీఐ రామకృష్ణ, దేవదాయశాఖ సిబ్బంది, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.

రాయచోటి టౌన్‌ : రాయచోటి శ్రీ భధ్రకాళీసమేత శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం చండీహోమం నిర్వహించారు. అంతకు ముందు ఉదయం స్వామి, అమ్మవార్లు శేషవాహనంలో పట్టణ పురవీధుల్లో ఊరేగారు.అర్చకులు స్వామి, అమ్మవార్లకు అభిషేకాలు, పూజలు జరిపారు. బంగారు ఆభరణాలు, పట్టువస్త్రాలు, రంగురంగుల పూలతో అందంగా అలంకరించారు.భక్తులు అధికసంఖ్యలో స్వామి, అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ పాలక మండలి అధ్యక్షులు తిరుమల మనోజ్‌కుమార్‌, ఆలయ ఈవో డివి రమణారెడ్డి పాల్గొన్నారు.

పదోతరగతి పరీక్షలకు  పక్కాగా ఏర్పాట్లు చేయాలి  1
1/2

పదోతరగతి పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలి

పదోతరగతి పరీక్షలకు  పక్కాగా ఏర్పాట్లు చేయాలి  2
2/2

పదోతరగతి పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement